రెండో రోజూ తగ్గిన పెట్రోలు, డీజిల్ ధరలు

అయ్యప్ప ఆలయానికి అర కి.మీ. దూరంలో….మహిళా రిపోర్టర్
October 19, 2018
ప్రభాస్ పెళ్లి వధువు ఎవరంటే…?
October 19, 2018

రెండో రోజూ తగ్గిన పెట్రోలు, డీజిల్ ధరలు

రెండో రోజూ తగ్గిన పెట్రోలు, డీజిల్ ధరలు

రెండోరోజు శుక్రవారం (అక్టోబరు 19) దేశవ్యాప్తంగా పెట్రోలుపై, డీజిల్ ధరలు మరింత తగ్గాయి. హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధర 22 పైసలు తగ్గి రూ.87.59, డీజిల్ ధర 12 పైసలు తగ్గి రూ.82.21 కి చేరింది. విజయవాడలో 22 పైసలు తగ్గిన పెట్రోల్ ధ‌ర రూ.86.61 ఉండగా.. డీజిల్ ధర 11 పైసలు తగ్గి రూ.80.85 గా కొనసాగుతోంది.

ఆయిల్ మార్కెట్ కంపెనీలు పెట్రోలు, డీజిల్ ధరలను మరోసారి సవరించాయి. దీంతో వరుసగా రెండోరోజు శుక్రవారం (అక్టోబరు 19) దేశవ్యాప్తంగా పెట్రోలుపై, డీజిల్ ధరలు మరింత తగ్గాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో 24 పైసలు పెరిగిన పెట్రోలు ధర రూ.82.38 కి తగ్గింది. డీజిల్ ధర 10 పైసల మేర తగ్గి రూ.75.48 కి చేరింది. ఇక వాణిజ్య రాజధాని ముంబయిలోనూ 24 పైసలు తగ్గిన పెట్రోలు ధర రూ.87.84 కి చేరింది. డీజిల్ ధర 11 పైసలు తగ్గి రూ.79.13 కి చేరింది.

ఇక తెలుగు రాష్ట్రాల విషయాన్నికొస్తే.. హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధర 22 పైసలు తగ్గి రూ.87.59, డీజిల్ ధర 12 పైసలు తగ్గి రూ.82.21 కి చేరింది. విజయవాడలో 22 పైసలు తగ్గిన పెట్రోల్ ధ‌ర రూ.86.61 ఉండగా.. డీజిల్ ధర 11 పైసలు తగ్గి రూ.80.85 గా కొనసాగుతోంది. 

కోల్‌కతాలో పెట్రోలు 23 పైసలు, డీజిల్ 9 పైసలు తగ్గింది. దీంతో పెట్రోలు ధర రూ.84.21 ఉండగా.. డీజిల్ ధర రూ.77.33 గా ఉన్నాయి.

చెన్నైలో పెట్రోలు 25 పైసలు, డీజిల్ 10 పైసలు తగ్గింది. దీంతో అక్కడ పెట్రోలు ధర రూ.85.63 ఉండగా.. డీజిల్ ధర రూ.79.82 గా ఉంది.

ఇక ఐటీ నగరం బెంగళూరులో పెట్రోలు 24 పైసలు, డీజిల్ 10 పైసలు తగ్గింది. ప్రస్తుతం లీటరు పెట్రోలు ధర రూ.83.03 ఉండగా.. డీజిల్ ధర రూ.75.87 వద్ద కొనసాగుతోంది..

Leave a Reply

Your email address will not be published.

//]]>