19న జనసేనలో చేరిక: సుందరపు విజయకుమార్‌

విజయశాంతి ఎన్నికల ప్రచార పర్యటన వాయిదా
October 15, 2018
పదేళ్లు వెనక్కి నెట్టేసింది: ఉద్దానం కొబ్బరి రైతుల ఆవేదన
October 15, 2018

19న జనసేనలో చేరిక: సుందరపు విజయకుమార్‌

 
నమ్ముకున్న ప్రజలకు తనను దూరం చేశారనే మనస్తాపంతోనే తెలుగుదేశం పార్టీని వీడుతున్నానని సుందరపు విజయకుమార్‌ అన్నారు. ఆదివారం ఇక్కడ విలేకర్లతో మాట్లాడుతూ, 2011లో చంద్ర బాబునాయుడు ఆదేశాలతో ఎలమంచిలి నియోజకవర్గం పార్టీ పగ్గాలు చేపట్టాన్నారు. ఆ సమయానికి పార్టీ కేడర్‌ చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో వున్నారని, ఈ సమయంలో కార్యకర్తలకు ధైర్యాన్ని కల్పించానన్నారు. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌లుగా పోటీచేయడానికి కూడా టీడీపీ నాయకులు భయపడేవారన్నారు. తాను వారికి భరోసా కల్పించి, ఎన్నికల్లో పోటీ చేయించానని, మొత్తం 91 పంచాయతీల్లో 41 పంచాయతీను గెలిపించుకున్నామన్నారు.
Image result for సుందరపు విజయకుమార్‌
 
2014 ఎన్నికల్లో తనకు టిక్కెట్‌ ఇవ్వకపోయినా, అధిష్ఠానం ఆదేశాలకు కట్టుబడి టీడీపీ అభ్యర్థి గెలుపునకు కృషి చేశానన్నారు. తరువాత తనకు న్యాయం చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు నారా లోకేష్‌ కూడా హామీ ఇచ్చారని, కానీ తనపాటు తనను నమ్ముకున్న వారికి కూడా అన్యాయం జరిగిందన్నారు. తన అనుచరుల నిర్ణయం మేరకు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నానని, ఈ నెల 19న జనసేనలో చేరుతున్నానని చెప్పారు. ఈ సమావేశంలో అన్నం బాబ్జీ, పైల రామునాయుడు, లోవరాజు, నరసింగరావు, మద్దాల కృష్ణ, కన్నబాబు, పెంటకోట విజయ్‌, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

//]]>