హైదరాబాద్‌లో వర్ష బీభత్సం

కేసీఆర్ హామీల వర్షం
October 17, 2018
శబరిమల వద్ద ఉద్రిక్త
October 17, 2018

హైదరాబాద్‌లో వర్ష బీభత్సం

హైదరాబాద్‌లో వర్షం సృష్టించిన బీభత్సం

 భారీ వర్షంతో ఇద్దరి మృతి

 మ్యాన్‌హోల్‌లో పడి ఒకరు, పిడుగు పడి మరొకరు

 చెరువులను తలపించిన రహదారులు

 షాపింగ్‌తో ట్రాఫిక్‌ కష్టాలు డబుల్‌

 గంటల కొద్దీ ట్రాఫిక్‌ జామ్‌

నగరంలో మంగళ వారం సాయంత్రం వర్షం బీభత్సం సృష్టించింది. భారీ వర్షాని కి మ్యాన్‌హోళ్లు పొంగిపొర్లాయి. బోరబండలో మ్యాన్‌హోల్‌లో పడి ఓ వ్యక్తి, పుప్పాల్‌గూడలో పిడుగు పడి మరో యువకు డు మృతి చెందారు. గంటపాటు కురిసిన భారీ వర్షంతో రోడ్లు చెరువులయ్యాయి. కుండపోతగా కురిసిన వానకు తోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరదనీరు రావడం తో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డా రు. మాదాపూర్‌, బేగంపేటలో అత్యధికం గా 3.3 సెం.మీ వర్షపాతం నమోదైంది. శ్రీనగర్‌కాలనీ, జూబ్లీ హిల్స్‌ 1.3 సెం.మీ వర్షం కురిసింది. దస రా పండుగకు షాపింగ్‌ కోసమంటూ రోడ్లపైకి వచ్చిన నగర వాసులకు వర్షం.. ట్రాఫిక్‌ చుక్కలు చూపించాయి. అమీర్‌పే ట, కూకట్‌పల్లి, ఆబిడ్స్‌, సికింద్రాబాద్‌ తదితర ప్రాంతాల్లో షాపింగ్‌ చేసేందుకు కుటుంబ సభ్యులతో వచ్చిన నగరవాసు లు ట్రాఫిక్‌లో ఇరుక్కొని చుక్కలు చూశారు.
 
రసూల్‌పురా చౌ రస్తాలో మోకాళ్ల లోతు వరద నీరు నిలిచిపోవడంతో స్థానికు లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పది రోజులుగా ఎండాకాలం తరహాలో నమోదవు తున్న ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కరవు తున్న నగరవాసులు భారీ వర్షంతో తడిసిముద్దయ్యారు. అమీ ర్‌పేట, ఎర్రగడ్డ, బేగంపేట, మాదాపూర్‌, కొండాపూర్‌, బంజా రాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్‌, కూకట్‌పల్లి, విల్లామేరి క ళాశాల, లక్డీకపూల్‌ పెట్రోల్‌ బంక్‌, మోడల్‌ హౌస్‌, పంజాగు ట్ట మసీదు ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు భారీగా నిలిచింది. దీంతో ట్రాఫిక్‌ స్తంభించిపోయిం ది. ట్రాఫిక్‌ క్లియరయ్యేందుకు 4 గంటలు పట్టింది. పలు ప్రాంతా ల్లో విద్యుత్‌ సరఫరాలో అంతరా యం ఏర్పడి ఇబ్బందులు పడ్డా రు. వర్షాల నేపథ్యంలో విద్యుత్‌ అధికారులు 24 గంటలు అప్రమ త్తంగా ఉండాలని టీఎస్‌ఎస్పీడీసీ ఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి అధికారు లను ఆదేశించారు.
 
మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి మృతి…
భారీ వర్షం కారణంగా బోరబండ రామారావునగర్‌లో మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి మృతి చెందాడు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలం, వడ్డపల్లి గ్రామానికి చెందిన జె. రాజయ్య(55) కుటుంబ సభ్యులతో 20 ఏళ్ల క్రితం నగ రానికి వలస వచ్చాడు. బోరబండ రామారావునగర్‌లో ని వాసం ఉంటూ సెంట్రింగ్‌ పనిచేస్తూ కుటుంబాన్ని పోషి స్తున్నాడు. భారీ వర్షంతో రహదారిపై ఉన్న మ్యాన్‌హోళ్ల మూతలను తొలగించారు. వీటిని గమనించక రాజయ్య అందులో పడి ఊపిరాడక మృతిచెందాడు. మృతదేహం కొట్టుకొచ్చిన విషయం తెలుసుకున్న డిప్యూటీ మేయర్‌ బాబా ఫసీయుద్దీన్‌ ఘటనా స్థలాన్ని సందర్శించారు. అధి కారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. రాజయ్య కొడుకు రాంచం దర్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే పుప్పాల్‌గూడ ప్రాంతంలో పిడుగు పడి త్రిపుర రాష్ట్రానికి చెందిన అభిరాంశర్మ మృతి చెందాడు.
 
ప్రయాణికుల అవస్థలు…
సొంతూళ్లకు వెళ్లేందుకు బస్టాండ్లు, రైల్వేస్టేషన్లకు వెళ్తున్న ప్రయాణికులు వర్షంతో తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఒక పక్క వర్షం మరో పక్క ట్రాఫిక్‌తో బస్సులు, క్యాబ్‌లు, ఆటోలు రోడ్లపై బారులు తీరాయి. మాదాపూర్‌, కొండాపూర్‌, గచ్చిబౌలి, హైటెక్‌సిటీ-కూక ట్‌పల్లి, మోతినగర్‌-ఎర్రగడ్డ, సికింద్రాబాద్‌, బేగంపేట ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తాయి.
 
మరో రెండు రోజులు వర్షాలు…
మరో రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముం దని వాతావ రణ శాఖ అధికారులు తెలిపారు. దక్షిణ అండమాన్‌ సముద్రం, దాని పరిసర ప్రాంతాలలో 3.1 కి.మీ నుంచి 7.6 కి.మీ మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడిం దని, దక్షిణ మధ్య మహారాష్ట్ర, దాని పరిసర ప్రాంతాలలో 0.9 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న నేపథ్యంలో మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశముందని బేగంపేట వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.

//]]>