జగన్ పట్టించుకోకపోతే పార్టీకి రాజీనామా..!
October 17, 2018
తుపాన్‌లో పాప జననం…తిత్లీగా నామకరణం
October 17, 2018

సొమ్ము ఖాళీ..!

ఏటీఎం కార్డుల్లో సొమ్ము ఖాళీ..!

విశాఖలో ఖాతాలు.. ముంబైలో విత్‌డ్రాలు.

సుమారు రూ.6 లక్షలు అపహరణ.

వన్నీ విశాఖలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆ ఫ్‌ ఇండియా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు ఖాతాలు. కస్టమర్లు కూడా స్థానికు లే.. కానీ ముంబైలోని ఎటీఎంల నుంచి ఆ ఖాతాల్లోని డబ్బు విత్‌ డ్రా అవుతున్నాయి. 10 వేలు, 20 వేలు, 40 వేలు… ఇలా ఖాతా నుంచి డబ్బు విత్‌డ్రా అయినట్టు వస్తున్న మెసేజ్‌లు చూసి కస్టమర్లు బెంబేలెత్తిపోతున్నారు. లబోదిబోమంటూ బ్యాంకులకు పరుగులు పెడుతున్నారు. ఈ ఖాతాలను పరిశీలించిన అధికారులు ముంబైలో ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రా అవుతున్నట్టు గుర్తించారు. బ్యాంకు అధికారుల సూచన మేరకు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. సోమ, మంగళవారాల్లో 18 మంది ఖాతాల నుంచి సుమారు రూ.6 లక్షల నగదు మాయమైంది. దీంతో ఆయా బ్యాంకుల ఖాతాలు హ్యాక్‌ అయి ఉండొచ్చని, లేదంటే ఏటీఎం కార్డులు క్లోనింగ్‌కు గురై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.

//]]>