“సైరా నరసింహారెడ్డి” కొత్త అప్‌డేట్

ప్రారంభమైన ‘జెర్సీ’
October 17, 2018
నాని జెర్సీ సినిమా ప్రారంభ ఫోటోలు
October 17, 2018

“సైరా నరసింహారెడ్డి” కొత్త అప్‌డేట్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ పిరియాడిక్ డ్రామా తెరకెక్కుతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో చిరు సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా జార్జియాలో షూటింగ్ పూర్తి చేసుకుంది.
 
ప్రస్తుత షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుపుకోనుంది. దీనికోసం రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్‌ను ఏర్పాటు చేశారు. ఈ షెడ్యూల్ నెలకు పైగా జరగనుంది. ఈ షెడ్యూల్‌తో 90 శాతం షూటింగ్ పూర్తి కానుంది. ‘సైరా’ డిసెంబర్ నాటికి షూటింగ్‌ను పూర్తి చేసుకుని నిర్మాణాంతర పనులను చూసుకోనుంది. బిగ్‌బి అమితాబ్, తమన్నా, విజయ్ సేతుపతి, సుదీప్, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరిలో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a Reply

Your email address will not be published.

//]]>