ప్రభాస్ పెళ్లి వధువు ఎవరంటే…?

రెండో రోజూ తగ్గిన పెట్రోలు, డీజిల్ ధరలు
October 19, 2018
23-10-2018
October 23, 2018

ప్రభాస్ పెళ్లి వధువు ఎవరంటే…?

ప్రభాస్ పెళ్లి: కొత్త వార్త ప్రచారంలోకి.. వధువు ఎవరంటే?

ప్రభాస్ పెళ్లికి సంబంధించి మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. మన బాహుబలి పెళ్లాడబోయేది ఎవరో ఫ్యాన్స్ చెప్పేస్తున్నారు

ప్రభాస్ పెళ్లి: కొత్త వార్త ప్రచారంలోకి.. వధువు ఎవరంటే?

ప్రభాస్ పెళ్లెప్పుడు..? గత కొద్ది సంవత్సరాలుగా ఈ ప్రశ్నకు సమాధానం కోసం తెలుగు ప్రజలు ఎదురు చూస్తున్నారు. బాహుబలి సిరీస్‌లో రెండు సినిమాలొచ్చాయి కానీ.. ప్రభాస్ నోటి పెళ్లి మాట మాత్రం రాలేదు. ఈ ఏడాదైనా డార్లింగ్ పప్పన్నం పెట్టకపోతాడా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే అక్టోబర్ 23న తన పుట్టిన రోజు సందర్భంగా గుడ్ న్యూస్ చెబుతానని ప్రభాస్ ప్రకటించాడు. బర్త్ డే సందర్భంగా.. ప్రభాస్ పెళ్లి ప్రకటన చేస్తాడని తెలుస్తోంది.

ప్రచారంలో ఉన్న రూమర్ల ప్రకారం.. ప్రభాస్ వచ్చే ఏడాది పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. యంగ్ రెబల్ స్టార్ పెళ్లాడేది ఎవరిని అనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. డార్లింగ్ అనుష్కను వివాహం చేసుకుంటాడనే వార్త గత కొన్నాళ్లుగా ప్రచారంలో ఉంది. అలాంటిదేం లేదని అనుష్క చెప్పినా ఫలితం లేకపోయింది.

ప్రభాస్‌ తన బంధువుల అమ్మాయిని పెళ్లాడబోతున్నాడని తెలుస్తోంది. పెళ్లి కూతురుది గుంటూరు అని చెబుతున్నారు. అక్టోబర్ 23న బాహుబలి తన ఎంగేజ్‌మెంట్, పెళ్లి తేదీలను ప్రకటిస్తాడని ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం సుజీత్ డైరెక్షన్లో తెరకెక్కుతోన్న సాహో సినిమాలో ప్రభాస్ నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ పూర్తయ్యాక 2019 మధ్యలో డార్లింగ్ పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారట.

Leave a Reply

Your email address will not be published.

//]]>