గౌతీకి సచిన్‌ జన్మదిన శుభాకాంక్షలు

కౌగిలించుకుని, ముద్దు పెట్టబోయాడు
October 15, 2018
ఆధార్‌పై మనసుపడిన: మలేసియా
October 15, 2018

గౌతీకి సచిన్‌ జన్మదిన శుభాకాంక్షలు

గంభీర్‌.. నీ ఇన్నింగ్స్‌ ఎప్పటికీ గుర్తుంటుంది
గౌతీకి సచిన్‌ జన్మదిన శుభాకాంక్షలు

టీమిండియా ఒకప్పటి ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌కు బ్యాటింగ్‌ దిగ్గజం సచిన్‌ తెందుల్కర్‌ శుభాకాంక్షలు తెలియజేశాడు. గౌతీ ఆదివారం 37వ వసంతంలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా అతడికి సచిన్‌, శిఖర్‌ ధావన్‌, అభిమానులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

‘గంభీర్‌.. ప్రపంచకప్‌ ఫైనల్లో నీ ఇన్నింగ్స్‌ ఎప్పటికీ గుర్తుంటుంది. ఈ ఏడాదంతా నీకు బాగుండాలి’ అని సచిన్‌ ట్వీట్‌ చేశాడు. ‘గౌతమ్‌ గంభీర్‌ మంచి మనసున్న నిజమైన మనిషి నువ్వు. ఎప్పుడూ ఇలాగే ముందుకు సాగిపోవాలి’ అని శిఖర్‌ ధావన్‌ శుభాకాంక్షలు తెలిపాడు. ‘10,324 అంతర్జాతీయ పరుగులు, 2007 టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో 75 పరుగులు. 2011 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో 97 పరుగులు. గంభీర్‌కి‌ 37వ పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అని ఐసీసీ ట్వీట్‌ చేసింది. బీసీసీఐ శ్రీలంకపై ఈడెన్‌లో గంభీర్‌ అద్భుత ఇన్నింగ్స్‌ వీడియోను పోస్ట్‌ చేసింది.

గంభీర్‌ టీమిండియా తరఫున అద్భుత ఇన్నింగ్స్‌లు‌ ఆడాడు. వీరేంద్ర సెహ్వాగ్‌తో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. టెస్టుల్లో వరుసగా ఐదు శతకాలు బాదిన ఒకే ఒక్క భారత క్రికెటర్‌ గంభీర్.‌ ఇక వివ్‌ రిచర్డ్స్‌ తర్వాత వరుసగా 11 అర్ధశతకాల రికార్డూ అతడిదే.

 

Leave a Reply

Your email address will not be published.

//]]>