క్రికెట్ కోసమే పృథ్వీ షా పుట్టాడు: రవిశాస్త్రి ప్రశంసలు

రెండో టెస్ట్‌లోనూ విండీస్ చిత్తు
October 15, 2018
కౌగిలించుకుని, ముద్దు పెట్టబోయాడు
October 15, 2018

క్రికెట్ కోసమే పృథ్వీ షా పుట్టాడు: రవిశాస్త్రి ప్రశంసలు

అతడి ఆటను చూస్తే ఓ కోణంలో సచిన్, మరోకోణంలో సెహ్వాగ్, లారా కనిపిస్తున్నారని పృథ్వీ షా ఆటను రవిశాస్త్రి కొనియాడారు.

 

టీమిండియా యువ సంచలనం పృథ్వీ షాపై జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రిప్రశంసల వర్షం కురిపించాడు. అతడి బ్యాటింగ్‌ను, అంకితభావాన్ని గమనిస్తే క్రికెట్ ఆడేందుకు పుట్టాడు అనిపిస్తుందని కితాబిచ్చాడు శాస్త్రి. అరంగేట్రం చేసిన టెస్ట్ సిరీస్‌లోనే అద్భుతంగా రాణించి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ సాధించి సత్తాచాటాడు షా. 

 

వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌ను టీమిండియా 2-0తో కైవసం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించాడు పృథ్వీ షా. ఆదివారం రెండో టెస్టులో భారత్ విజయం సాధించిన తర్వాత రవిశాస్త్రి మీడియాతో మాట్లాడాడు. షా అరంగేట్రం.. తనకు సచిన్, సెహ్వాగ్, బ్రియాన్ లారాలను గుర్తుచేస్తుందన్నాడు. ‘క్రికెట్ ఆడేందుకు పృథ్వీ షా పుట్టాడు. ఎనిమిదేళ్ల నుంచి క్రికెట్ ఆడుతున్నాడు. అతడి ఆటను చూస్తే ఓ కోణంలో సచిన్, మరోకోణంలో సెహ్వాగ్, లారా కనిపిస్తున్నారు. జట్టు భారాన్ని అప్పుడు భుజాలపై వేసుకోవడం ఆటగాడికి కలిసొస్తుంది. 

ఉమేశ్ యాదవ్, రిషబ్ పంత్ కూడా తమ వంతు మెరుగైన ప్రదర్శన చేశారు. పునరాగమనంలో ఉమేశ్ 10 వికెట్ల ఇన్నింగ్స్‌తో సత్తా చాటాడు. అందివచ్చిన అవకాశాల్ని పంత్ సద్వినియోగం చేసుకున్నాడు. ఫామ్‌ను చూసి ఆటగాళ్ల ఎంపిక ఉంటుంది తప్ప, సాహానా లేక పంత్‌ను కీపర్‌గా కొనసాగిస్తామని చెప్పలేం’ అన్నాడు రవిశాస్త్రి. 

 

Leave a Reply

Your email address will not be published.

//]]>