కన్నీళ్లు ఆగలేదు…శ్రీశాంత్‌

కారులోలైంగిక వేధింపు!
October 17, 2018
పవన్‌తో నాదెండ్ల స్నేహానికి కారణం ఎవరు…?
October 17, 2018

కన్నీళ్లు ఆగలేదు…శ్రీశాంత్‌

స్పాట్‌ ఫిక్సింగ్‌ స్కామ్‌తో పేసర్‌ కెరీర్‌ అల్లకల్లోలమైంది. అతడిపై బీసీసీఐ జీవితకాల నిషేధం విధించడంతో కోర్టులో పోరాడుతున్నాడు. అయితే, 2007 వరల్డ్‌ టీ20, 2011 వన్డే వరల్డ్‌కప్‌ గెలిచిన జట్టులో శ్రీశాంత్‌ సభ్యుడు. బిగ్‌బాస్‌ రియాల్టీ షోలో కంటెస్టెంట్‌గా ఉన్న శ్రీశాంత్‌.. దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ తన గురించి మాట్లాడిన మాటలు కన్నీళ్లు తెప్పించాయని గుర్తు చేసుకున్నాడు. ‘వన్డే వరల్డ్‌ కప్‌ నెగ్గిన రెండేళ్ల తర్వాత మేం పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో నన్ను మినహా అప్పటి జట్టులోని ఆటగాళ్లందరి పేర్లను వ్యాఖ్యాత ప్రస్తావించాడు. అయితే, ఇంటర్వ్యూ ముగియడానికి కొన్ని నిమిషాల ముందు సచిన్‌ నా పేరు కూడా చెప్పాడు. వరల్డ్‌ కప్‌ నెగ్గడంలో శ్రీశాంత్‌ కూడా కీలక పాత్ర పోషించాడన్నాడు.

 టెండూల్కర్‌ అంత గొప్పగా చెప్పడంతో ఎంతో భావోద్వేగానికి గురయ్యా. ఉబికివస్తున్న కన్నీళ్లను ఆపుకోలేకపోయాన’ని శ్రీశాంత్‌ చెప్పాడు.

Leave a Reply

Your email address will not be published.

//]]>