‘ఎన్టీఆర్‌’ సతీమణి ఫస్ట్‌లుక్‌ వచ్చింది

శబరిమల వద్ద ఉద్రిక్త
October 17, 2018
ఇకపై విదేశీ పర్యటనలకు వారూ వెళ్లొచ్చు!
October 17, 2018

‘ఎన్టీఆర్‌’ సతీమణి ఫస్ట్‌లుక్‌ వచ్చింది

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు జీవితాధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘యన్‌టిఆర్’. క్రిష్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమాలోని ప్రధాన పాత్రధారుల ఫస్ట్‌లుక్‌లను చిత్ర బృందం విడుదల చేసింది. ఇప్పుడు ఎన్టీఆర్‌ సతీమణి బసవతారకం లుక్‌ బయటికి వచ్చింది. ఆమె పాత్రలో బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌ నటిస్తున్నారు. బసవతారకంలా తయారై అద్దం ముందు కూర్చుని తన అందాన్ని చూసుకుంటున్న ఫొటోను విద్యా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు.

ఫొటోపై ‘నేనేం చూస్తున్నాను’ అని రాశారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. శరవేగంగా ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. ‘యన్‌టిఆర్‌’ బయోపిక్‌లో కుమారుడు హరికృష్ణ పాత్రలో కల్యాణ్‌రామ్‌, చంద్రబాబు నాయుడుగా దగ్గుబాటి రానా, అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్‌, శ్రీదేవిగా రకుల్‌ప్రీత్‌ సింగ్‌ తదితరులు నటిస్తున్నారు. ఎన్‌బీకే ఫిల్మ్స్‌, వారాహి చలన చిత్ర పతాకంపై బాలకృష్ణ, సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. ‘యన్‌టిఆర్‌’ బయోపిక్‌ రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. 2019 జనవరి 9న ‘కథానాయకుడు’, జనవరి 24 ‘మహానాయకుడు’గా విడుదల చేస్తారు.

Leave a Reply

Your email address will not be published.

//]]>