ఇకపై విదేశీ పర్యటనలకు వారూ వెళ్లొచ్చు!

‘ఎన్టీఆర్‌’ సతీమణి ఫస్ట్‌లుక్‌ వచ్చింది
October 17, 2018
మైసూర్ ప్యాలెస్‌లో దసరా వేడుకలు రద్దు…!
October 19, 2018

ఇకపై విదేశీ పర్యటనలకు వారూ వెళ్లొచ్చు!

టీమిండియా విదేశీ పర్యటనలకు ఆటగాళ్ల భాగస్వాములను లేదా వారి ప్రియురాళ్లను అనుమతించాలని కొహ్లీ చేసిన అభ్యర్థనకు బీసీసీఐ అంగీకరించినట్లు సమాచారం. దీర్ఘ కాలిక పర్యటనలు ఉన్న సమయంలో మొదటి పది రోజుల తర్వాత వెళ్లి పర్యటన ముగిసేవరకూ వారి భాగస్వాములు ఉండొచ్చని పాలకుల కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుత నిబంధనల ప్రకారం విదేశీ పర్యటనల్లో ఆటగాళ్ల వెంట తమ జీవిత భాగస్వాములు, వ్యక్తిగత సిబ్బందిని రెండు వారాలపాటే అనుమతిస్తున్నారు. అయితే ఈ నిబంధనలను మార్చాలని.. విదేశీ పర్యటన పూర్తికాలం జీవితభాగస్వాములను తమతో అనుమతించాలని ఇటీవల కోహ్లీ బీసీసీఐని అభ్యర్థించిన విషయం తెలిసిందే. దీనిపై ఆటగాళ్ల అభిప్రాయం తీసుకునేందుకు కోచ్‌ రవిశాస్త్రి, కొహ్లీ, రోహిత్‌ శర్మను పాలకుల కమిటీ వెస్టిండీస్‌తో రెండో టెస్టుకు ముందు కలిసి చర్చించింది. ఆటగాళ్ల వెంట జీవితభాగస్వాములను, ప్రియురాళ్లను అనుమతించాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published.

//]]>