అయ్యప్ప ఆలయానికి అర కి.మీ. దూరంలో….మహిళా రిపోర్టర్

ప్రత్యేక చట్టం తేవాలి: ‌ఆర్ఎస్ఎస్ చీఫ్
October 19, 2018
రెండో రోజూ తగ్గిన పెట్రోలు, డీజిల్ ధరలు
October 19, 2018

అయ్యప్ప ఆలయానికి అర కి.మీ. దూరంలో….మహిళా రిపోర్టర్

అయ్యప్ప ఆలయానికి అర కి.మీ. దూరంలో.. హైదరాబాద్ మహిళా రిపోర్టర్, మరో మహిళ

హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళా రిపోర్టర్‌తోపాటు మరో మహిళ అయ్యప్ప ఆలయం దిశగా అడుగులేస్తున్నారు. వీరు ప్రస్తుతం సన్నిధానానికి అర కిలో మీటర్ దూరంలో ఉన్నారు.

అయ్యప్ప ఆలయ దర్శనం కోసం మహిళలు ప్రయత్నిస్తుండగా.. భక్తులు తీవ్రంగా అడ్డు తగులుతున్న సంగతి తెలిసిందే. దీంతో శబరిమలపరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొన్నాయి. మాస పూజల కోసం బుధవారం ఆలయాన్ని తెరిచినప్పటి నుంచి ఇప్పటి వరకూ 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న ఒక్క మహిళ కూడా అయ్యప్పను దర్శించుకోలేదు. కానీ హైదరాబాద్‌కు చెందిన కవిత అనే జర్నలిస్ట్‌తోపాటు మరో మహిళ అయ్యప్ప దర్శనానికి బయల్దేరారు. 

వీరిద్దరూ 5 కి.మీ. కొండ మార్గం ద్వారా నడుచుకుంటూ అయ్యప్ప సన్నిధానంవైపు అడుగులేస్తున్నారు. 100 మంది పోలీసుల భద్రత మధ్య వీరు వేర్వేరుగా కొండపైకి చేరుకుంటున్నారు. కవిత హెల్మెట్ ధరించగా.. రింగ్ ఫెన్స్ ద్వారా పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. మరో మహిళ నల్లటి వస్త్రాలతో ఇరుముడిని అయ్యప్ప స్వామికి సమర్పించడానికి వెళ్తున్నారు. ఆమెకు కూడా పోలీసులు భారీ భద్రత కల్పిస్తున్నారు. 

పంబా నుంచి 4.6 కి.మీ. దూరంలో, పర్వత మార్గంలో ఆలయం ఉంది. సన్నిధానానికి వీరు అర కి.మీ. దూరంలో ఉన్నారు. కొండ మీదకు చేరుకున్నాక.. గర్భాలయానికి వెళ్లి వారు అయ్యప్పను దర్శించుకుంటారు. పదునెట్టాంబడి అని పిలిచే 18 మెట్లను ఎక్కుతారు. అదే జరిగితే.. ఈ ఇద్దరు మహిళలు చరిత్రలో నిలిచిపోనున్నారు. 

కాగా.. వీరిని అడ్డుకునేందుకు ఆందోళనకారులు కొండ మీదకు చేరుకుంటున్నారని సమాచారం. గత రెండు రోజులుగా నీలక్కల్, పంబ బేస్ క్యాంపుల వద్ద భక్తులు ఆందోళనలు చేస్తున్నారు. మహిళలు ఆలయం దిశగా వెళ్లకుండా అడ్డుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published.

//]]>